వరి సాగులో ఎలుకల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని శంఖవరం మండల వ్యవసాయ అధికారి పడాల గాంధీ రైతులకు సూచించారు. శనివారం శంఖవరం, కత్తిపుడి ప్రాంతాల్లో రైతులతో వరి పంటను పరిశీలించి ఎలుకల వల్ల వరి పంటకు కలిగే నష్టాన్ని రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి మాట్లాడుతూ, రైతులు ఎప్పటికప్పుడు ఎలుకల బొరియలను గుర్తించాలన్నారు. అలా గుర్తించి వాటిలో బ్రోమోడయోలిన్ తో ఎర వేయాలన్నారు. అనంతరం ఎలుకల నియంత్రణ మందు తయారు చేసే విధానాన్ని రైతులకు తెలియజేశారు. పంట వేసిన తరువాత పొలం గట్లను శుభ్రం గా ఉంచుకోవాలని,ఎలుకల నివారణకు రైతులు సామూహికంగా ఎర మందు పెట్టడం ద్వారా నివారించ వచ్చు అని వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ప్రభాస్,చినబాబు,రైతులు పాల్గొన్నారు.