విశాఖజిల్లాలోని సిరిసపల్లి గ్రామంలోని శ్రీ చింతామణి గణపతి దత్త క్షేత్రంలో గణపతిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త క్షేత్రంలో జరగనున్న గణపతి నవరాత్రి మహోత్సవాల కరపత్రాన్ని అమర్ నాథ్ విడుదల చేశారు. దత్తక్షేత్రం గణపతి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు 1000 మారేడు మొక్కలు, 1000 గణపతి మట్టి ప్రతిమలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. వీటిని మంత్రి అమర్నాథ్ లాంఛనప్రాయంగా భక్తులకు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీచండీ హోమం పూర్ణాహుతిలో అమర్ నాథ్ పాల్గొన్నారు.