ఎలుకల నియంత్రణలో రైతులు భాగస్వామ్యం కావాలి


Ens Balu
8
Kalla
2022-08-27 13:46:17

సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ భాగస్వాములై తమ పంటలను ఎలుకల బారి నుండి కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి .ప్రశాంతి అన్నారు. శనివారం కాళ్ల మండలం సీసలి గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద సామూహిక ఎలుకల  నిర్మూలనకు ఎలుకల మందు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టరు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు  ఎలుకలు పాడుచేయడం  వల్ల చాలా నష్టం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.   ఎలుకలు చేసే నష్టాల నుండి రైతులు బయటపడడానికి సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో అందరూ భాగస్వాములై తమ తమ పొలాలలో ఉన్న ఎలుకల కన్నలలో ఎలుకల మందు పొట్లాలు ఉంచి వాటిని నిర్మూలించాలని కలెక్టర్ సూచించారు . 

నిన్న మూసిన ఎలుక కన్నాలలో  ఈరోజు ఏవైతే తెరుచుకున్నాయో ఆ కన్నాలలో ఈ ఏలుకల మందు పోట్లలు ఉంచాలని సూచించారు .ఎలుకల మందు తయారీకి నూకలు ,నూనె , బ్రోమెడయోలిన్ ఎలుకల మందు మిక్స్ చేసి  ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వర రావు, సహాయ సంచాలకులు కె ఏ యస్.యస్ శ్రీనివాసరావు, తహశీల్దారు కె.కృష్ణారావు, యం.పి.డి.వో స్వాతి, వ్యవసాయ శాఖ అధికారి కె.జయవాసకి, ఆర్బికె సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు