గ్రామాల్లో రక్షణ కల్పించేలా పనిచేయాలి


Ens Balu
8
Annavaram
2022-08-27 14:18:29

గ్రామ సచివాలయ మహిళా పోలీసులు గ్రామాల్లో మహిళలకు, విద్యార్ధినిలకు రక్షణ కల్పించేవిధంగా పనిచేయాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు సూచించారు. శనివారం వార్షిక పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా శంఖవరం మండలంలోని అన్నవరం పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గ్రామాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా స్టేషన్ కు తరలించి పరిష్కరించంలో కీలకంగా ఉండాలన్నారు. అన్నివర్గాల వారితో కలివిడిగా ఉంటూ పోలీసు సేవలు ప్రజలకు చేరువ అయ్యేలా చూడాలన్నారు. అన్ని విషయాల్లోనూ అవగాహన పెంచుకొని సచివాలయాల నుంచే పోలీసు సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐ సోభన్ కుమార్,  గ్రామ సచివాలయ మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, పిఎస్ఎస్. కళాంజలి, జర్తా.నాగమణి, రజియాసుల్తానా తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు