ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల రెండేళ్ల సర్వీసు ప్రొబేషన్ ను రెగ్యులర్ చేసిన తరువాత అందరిపై మరింత బాధ్యత పెరుగుతుందని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు పేర్కొన్నారు. శనివారం అన్నవరం పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఆయన మహిళా పోలీసుల సర్వీసు క్రమబద్దీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వం ఒక ఉన్నత లక్ష్యంతో గ్రామ రక్షణ కోసం మహిళా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామ సచివాలయాల్లో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించాలన్నారు. అనంతరం తమ సర్వీస్ రెగ్యులర్ అయిన సందర్భంగా తేంక్యూ సీఎం సర్..తేంక్యూ ఎస్సీ అంటూ గ్రామ సచివాలయ మహిళా పోలీసులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐ సోభన్ కుమార్, గ్రామ సచివాలయ మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, పిఎస్ఎస్. కళాంజలి, జర్తా.నాగమణి, రజియాసుల్తానా తదితరులు పాల్గొన్నారు.