కోవిడ్ వైరస్ ప్రభావం, వర్షాలు కురుస్తున్నందున అధికమై పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డాక్టర్ కే. వెంకటరమణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే వాంతులు, విరేచనాలు అవుతాయన్నారు. తలనొప్పి, కండరాల నొప్పులు, ఆయాసంతో పాటు శరీరం పై దద్దుర్లు వచ్చే అవకాశం ఉందన్నారు. దీని నివారణకు గాను నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినరాదని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.