అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు డా.వైఎస్సార్ ఆసరా చెక్కులను డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే సహాయంలో ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు. రైవాడ పంచాయితీ శంఖువాని పాలెం గ్రామైఖ్య సంఘం పరిధిలో గల ఈశ్వర స్వయం సహాయక సంఘానికి కు వైఎస్సార్ ఆసరా రెండువిడత మొత్తం రూ 1,55,226/ -లక్షలు . మరియు కాశీపురం గ్రామైఖ్య సంఘం పరిదిలో మరిడి మంబ- 2 ఎస్ హెచ్ జి కు వైఎస్సార్ ఆసరా రెండు విడతల మొత్తం రూ. 69,988 /- వచ్చింది. మరియు ఎం.అలమండ పంచాయితీ పరిది - ముత్యాలమ్మ ఎస్ హెచ్ జీ కు ఆసరా రెండు విడత మొత్తం రూ 1,23,214/-లక్షలు వచ్చింది. ఈ మూడు సంఘాల యొక్క మొత్తం రూ.3,48,428/ - లక్షల చెక్ లను తారువ లోని క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు అందచేశారు. అదే విధంగా మంత్రి రూ.6,96,856/- లక్షలు మూడు సంఘాలకు కలిపి అధికారులు సాంక్షన్ చేశారు.. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి ఎంపీపీ బాస్కరరావు, జెడ్పీటీసీ సత్యం, పంచాయితీల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మండల కార్యకర్తలు పాల్గోన్నారు.