మీ ఇంటి చుట్టు ప్రక్కల అపారిశుధ్యాన్నిఇలాగే వదిలేస్తారా..ఇక్కడెవరు కార్యదర్శి..ఇంత అధ్వాన్నంగా పారిశుధ్య చేస్తున్నారేంటి అంటూ జెసి జెసి జెవి.మురళి శ్రుంగవ్రుక్షం-2 సచివాలయ సిబ్బందిపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. మంగళవారం పాలకోడేరు మండలం పెన్నాడ 1, శృంగవృక్షం 1,2 సచివాలయాలు తనిఖీలో భాగంగా జెసి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సేవలను నిరుపేదల ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారుల జాబితాలను పధకాల వారీగా నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటివద్దకు తీసుకువెళ్లేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చే దిశగా సిబ్బంది పనిచేయాలని జెసి సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా అనర్హుల జాబితాలను కూడా నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. ప్రతీ రోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రతీ సచివాలయం పరిధిలోనూ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించాలని, వాటిని అదేరోజు సంబంధిత శాఖల అధికారులను పరిష్కారం నిమిత్తం పంపించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందించాలన్నారు.
సచివాలయం ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు సమన్మయంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. శాఖల వారీగా సచివాలయం ఉద్యోగులను వర్క్ ప్లాన్ అడిగి తెలుసుకున్నారు. స్పందన, సి సి ఆర్ సి కార్డ్స్ , ఈ క్రాఫ్, అజమాయిషి హజరుపట్టి తదితర రిజిస్టర్లను పరిశీలించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించే స్థాయిలో ఉండాలని,ఏ చిన్న పిర్యాదు లేకుండా చక్కగా విధులు నిర్వర్తించాలని ఆయన అన్నారు. శృంగవృక్షం 2 వ సచివాలయంలో పారిశుధ్య నిర్వహణ బాగోలేదని జెసి సచివాలయ సెక్రెటరీ పై మండిపడ్డారు. సచివాలయం బయట డిస్ ప్లే చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల జాబితాలని పరిశీలించి, అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.