ఆర్బికే కేంద్రంలో జెసీ ఆకస్మిక తనిఖీ


Ens Balu
8
Srungavruksham
2022-08-30 11:59:25

రైతులకు పూర్తిస్థాయిలో ఆర్బీకేలు ఉపయోగపడాలని పశ్చిమగోదవారి జిల్లా జాయింట్ కలెక్టర్ జె వి మురళి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం శృంగవృక్షం గ్రామంలో సొసైటీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆర్బికే జెసి కేంద్రాన్ని తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించారు. సిసిఆర్సి కార్డులు పై లబ్ధిదారులకు అందిస్తున్న రుణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రుణాల వల్ల లబ్ధిదారులు పొందుతున్న ప్రయోజనాలు,   రైతులకు డబ్బులు జమవుతున్న విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం జెసి మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వ సేవలు, పథకాలు అన్నీ ఆర్బీకేల ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.  జిల్లా జాయింట్ కలెక్టరు వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నాగ లింగాచారి, తహశీల్దారు షేక్ హుస్సేన్, ఎంపీడీవో ఎన్ ఎం గంగాధర్, వ్యవసాయ శాఖ ఏవో నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు