శృంగవృక్షం గ్రామంలో వశిష్ట ఆగ్రో ఎంటర్ప్రైజెస్ ఎరువులు, పురుగు మందుల షాపులో పశ్చిమగోదవారి జిల్లా జాయింట్ కలెక్టర్ జె వి మురళి తనిఖీలు నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. స్టాక్ రిజిస్టర్లు, షాపుల లైసెన్స్ గడువు తేదీలు జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. గోడౌన్ కూడా తనిఖీ చేశారు. మందుల ప్యాకింగ్ వాటి ధరలు సక్రమంగా లేవని గమనించిన జాయింట్ కలెక్టర్ సంభందిత వ్యవసాయ శాఖ వారికి షాపు నిర్వాహకులపై తగు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టరు వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నాగ లింగాచారి, తహశీల్దారు షేక్ హుస్సేన్, ఎంపీడీవో ఎన్ ఎం గంగాధర్, వ్యవసాయ శాఖ ఏవో నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.