ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ పౌర సంబంధాల అధికారి పండు రాములుకు పాడేరు డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి కల్పిస్తూ సమాచార శాఖ కమీషనర్ ఆగస్టు 29న ఉతర్వులు జారీచేశారు. ఈమేరకు గురువారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా,జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో డివిజనల్ పౌర సంబంధాల అధికారి గా అయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే సహాయ ప్రాజెక్ట్ అధికారి (పబ్లిసిటీ)గా అదనపు భాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2007 నుండి 2012 శ్రీకాకుళం జిల్లాలో ఎపిఆర్వోగాను 2012 నుండి 2016వరకు ఐటిడిఎలో డి.ఎస్. ఓ గా డిప్యుటేషన్ పై విధులు నిర్వహించారు.2017లో విజయనగరం లో ఎ పి అర్ ఓ పనిచేశారు.2018 నుండి ఇప్పటివరకు పాడేరులో సహాయ పౌర సంంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతి పొందారు. డి పి అర్ ఓ పి.గోవిందరాజులు, ఎఈ పిల్లా శ్రీనివాసరావు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.