భూముల రీసర్వే తో పక్కాగా రికార్డులు


Ens Balu
17
Kasimkota
2022-09-06 10:06:28

భూములరీ సర్వేతో పక్కా రికార్డులు రూపొందుతాయని, భూమి కొలతల  విషయంలో  గతంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే   సరిదిద్దడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. మంగళవారం ఆమె అనకాపల్లి జిల్లా కశింకోట మండలం లో పర్యటించారు. తాసిల్దార్ కార్యాలయంలో రీసర్వే రికార్డులను పరిశీలించారు. చిన్న పొరపాటైనా జరుగకుండా సర్వే పక్కాగా జరగాలన్నారు. ఇప్పటివరకు జరిగిన రీసర్వే పై అధికారులు ఉద్యోగుల తో సమీక్షించారు. తరువాత వెదురుపర్తి గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్వే చేసిన భూమి వివరాలు ప్రదర్శించారా, సర్వే పనులు ఎలా ఉన్నాయి అని అడిగారు.  సర్వే పనులు సంతృప్తిగా ఉన్నాయని , భూమి వివరాలు పెట్టారని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్ నాయుడు, సర్వే, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు