పీఎం కిసాన్ పథకంలో అర్హులైన రైతులు ఈకేవైసీ చేసుకోడానికి రేపటితో (7వ తేదీ )గడువు ముగుస్తుందని శంఖవరం మండల వ్యవసాయ అధికారి పి.గాంధీ రైతులకు సూచించారు. మంగళవారం నెలిపూడి, కొంతంగి రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈ మేరకు రైతులకు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి మాట్లాడుతూ, వచ్చే 12 విడత సొమ్ము జమ కొరకు అర్హులైన ప్రతీ రైతు ఈకేవైసీ బుధవారం లోగా చేసుకోవాలని కోరారు. అనంతరం రైతులతో సమావేశమై ఈకేవైసీ,పంట నమోదు, వరిలో చీడ పీడల నివారణ తదితర అంశాలపై సూచనలు సహాలు చేశారు. రైతు భరోసా కేంద్ర సిబ్బంది చేసిన ఈ పంట నమోదు రైతుల వివరాలను పరిశీలించి సూచనలు ఇచ్చారు.వి.అర్. ఓ,సిబ్బంది తాతాజీ,శ్రావణి,రైతులు,వాలంటీర్లు పాల్గోన్నారు.