సర్పవరంలో ఘనంగా వామన జయంతి


Ens Balu
33
Kakinada
2022-09-07 06:59:24

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడని అందు అయిదవ అవతారంగా  భాద్రపద మాస ద్వాదశిన వామనవతారం ఎత్తాడని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ అన్నారు. బుధవారం కాకినాడ సర్పవరం జంక్షన్ లో శ్రీరామ నామ క్షేత్రం, ఆంధ్ర భద్రాద్రి ఆధ్వర్యంలో వామన జయంతిని  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్టాడుతూ,  బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం నిర్వహించడం ,విశేషంగా బ్రాహ్మణులకు దానాలు చేయడం తో  అమిత శక్తివంతుడై ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడని అన్నారు. దీంతో దేవతల తల్లి అయిన అదితి శ్రీమహావిష్ణువును వేడుకొనడంతో ఆయన వామావతారం ఎత్తి తనకు మూడు అడుగుల నేల కావాలని బలి చక్రవర్తిని కోరడం దానిపై దానికి అంగీకరించడం జరిగిందని అన్నారు. 

ఒక అడుగు నేలపై వేసి రెండో అడుగు ఆకాశం పై వేసి మూడో అడుగు ఎక్కడ వేయాలని బలి చక్రవర్తిని కోరగా తన నెత్తిపై వేయాలనగా వామనవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి పాతాళానికి తొక్కేస్తాడని పట్నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ నామ క్షేత్ర అధ్యక్షులు రాజా సౌజన్యంతో వృద్ధులకు భోజన వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు