అనకాపల్లి జిల్లాలో భూముల రీసర్వే వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. ఆమె బుచ్చయ్యపేట తాసిల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రీ సర్వే ప్రోగ్రెస్ ను పరిశీలించారు. ఎన్ని గ్రామాలు రీ సర్వే జరిగాయి, ఇంకా ఎన్ని జరగాలి అనే విషయమై తాసిల్దార్ ఎస్.బి. అంబేద్కర్, డిటి పి.మురళి, మండల సర్వేయర్ లతో చర్చించారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా రీ సర్వే పక్కాగా జరగాలన్నారు. రీ సర్వే మూలంగా కలిగే లాభాలను రైతులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.