ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారి పి గాంధీ సిబ్బందికి సూచించారు. బుధవారం శంఖవరం రైతు భరోసా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సిబ్బంది సాగు చేయడమే కాక ఎక్కువ మంది రైతులు ఈ విధానంలో వ్యవసాయం చేసే విధంగా చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సిబ్బంది శంఖవరం,నెల్లిపుడి , కొత్తపల్లి, పెదమల్లపురం, వేళంగి గ్రామాల్లో ఈ పద్దతుల్లో చేపడుతున్న పంటల సాగు విధానాలను వివరించారు. గ్రామీణ వ్యవసాయ సహాయకుల డ్యూటీ రిజిస్టర్ లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సత్తిబాబు,అప్పన్నదొర,సతీశ్,వీరబాబు, లక్ష్మణ్,ప్రసాద్,గోవింద్,లక్ష్మి,లోలాక్ష్మి,సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.