బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహరహం శ్రమించిన జాషువా సాహిత్యం, జీవితం స్ఫూర్తిదాయక మని విశ్రాంతి తాసిల్దార్ రేలంగి బాపిరాజు పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన జన్మించారని అన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య లోకాన ఆయనది ఒక ప్రత్యేకమైన స్థానమన్నారు. సామాజిక దృష్టి కోణంతో భావ, అభ్యుదయ భావనల మేలమింపుతో తనదైన శైలిలో సాంఘిక ఆర్థిక అసమానతల మూలాలను ఛేదిస్తూ ఆత్మ గౌరవానికి ప్రత్యేక గా నిలిచారని అన్నారు. జాషువా ఖండకావ్యాలన్నీ అఖండ కీర్తిని అర్జించి పెట్టే అద్భుత కావ్యాలు అని అన్నారు. సర్వ మానవుల సంతోషాన్ని తన రచనల ద్వారా కోరుకున్నారని అన్నారు. సామాజిక సమానత్వాన్ని ఆయన ఆకాంక్షించారని బాపిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్, రాజా తదితరులు పాల్గొన్నారు.