రాబిస్ వ్యాధిపై పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డా.కుమార్ యాదవ్ సూచించారు. గురువారం కాకినాడలోని రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబిస్ వ్యాధి నివారణ- నియంత్రణపై అవగాహన సదస్సు లో ఆయన మాట్లాడారు. రాబిస్ సోకిన కుక్క, గబ్బిలాలు, చిట్టి ఎలుక, పిల్లి, కోతి వంటి జంతువులు మనుషులను కరిస్తేనే రాబిస్ వ్యాధి వస్తుందన్నారు. ఇది లాలాజలం ద్వారా వస్తుందన్నారు. రాబిస్ సోకిన జంతువు గాట్లు పెట్టినా, గీరి నా వెంటనే సబ్బు నీటితో కడగాలన్నారు. దీనివలన వైరస్ ను నివారించే అవకాశం ఉందన్నారు. అనంతరం వైద్యుల సూచన మేరకు వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. రాబిస్ వ్యాధి వస్తే కుక్కలాగా మొరగడం, నీటి భయం ఎక్కువగా ఉంటుందన్నారు. లూయిస్ పాశ్చర్ రాబిస్ వ్యాక్సిన్ కనుగొనడంతో ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ప్రపంచ రాబిస్ దినోత్సవం గా జరుపుకుంటున్నామని డాక్టర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్, రేలంగి బాపిరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.