సంక్షేమ పథకాల రథసారథి అణ గారిన వర్గాల ఆశాజ్యోతి పేదల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనాలు జేజేలు పలుకుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డ్ పూజారి పేట లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహించారు ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డి బి టి సిస్టం ద్వారా అర్హుడైన లబ్ధిదారులకు అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకాలు అందుతున్నాయని ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలన్న జగన్ మోహన్ రెడ్డి ఆశయం గొప్పదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
ఆమదాలవలస మున్సిపాలిటీలో త్రాగునీరు కోసం 62 కోట్లతో ఏఐఐబి నిధుల ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే కార్యక్రమానికి శంకుస్థాపన చేశామని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని త్వరలో ప్రతి ఇంటికి మంచినీరు అందించే విధంగా చర్యలు చేపట్టామని స్పీకర్ తమ్మినేని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లం శెట్టి ఉమామహేశ్వర రావు, స్థానిక నాయకులు బొడ్డేపల్లి సుశీలమ్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూసుమంచి శ్యాం ప్రసాద్, మామిడి ప్రభాకర్ రావు, మావిడి రమేష్ కుమార్, పొన్నాడ చిన్నారావు, దుంపల శ్యామలరావు పొడుగు శ్రీను, కూన రామకృష్ణ, సాదు చిరంజీవి,దుంపల చిరంజీవి, వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.