గ్రామ, సచివాలయం ,రైతు బరోసా కేంద్రాల సిబ్బంది రైతులకు ,ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి అన్నారు. శుక్రవారం ఉండి మండలం ఉండి -1, కలసిపూడి ,చెరుకువాడ సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలను జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి ఆకస్మిక తనిఖీలు చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది హాజరును పరిశీలించారు. కేంద్రాలకు వచ్చే ప్రజలు, రైతులను చిరునవ్వుతో స్వాగతించి వారి పనులు త్వరితగతిన పూర్తి చేసి పంపించాలన్నారు. సచివాలయం, రైతు బరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేసిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. స్పందన అర్జీల పై ప్రత్యేక దృష్టి పెట్టి, వచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి సంబంధిత శాఖలకు సకాలంలో పంపాలని ఆయన అన్నారు.
పథకాలు తెలియని వారికి తెలియ చెప్పి , అర్హులకు ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు అందించాలని ఆయన అన్నారు. గ్రామ వాలంటీర్లు పనితీరు ఎలా ఉందని వారికి కేటాయించిన ఇండ్లకు ప్రతి గడపకు వెళ్లుతున్నారా అని అధికారులను అయన అడిగి తెలుసుకున్నారు.కార్యాలయం బయట వివిధ పథకాలు డిస్ప్లే చేసిన బోర్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలను జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి జారీ చేశారు.