భూ రిజిస్ట్రేషన్లకు మరో 15 సచివాలయాలు


Ens Balu
10
Bhimavaram
2022-09-30 12:08:18

భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లను రెండవ దశలో  గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహిం చేందుకు మరో 15 సచివాలయాలను ఎంపిక చేశామని జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి అన్నారు. శుక్రవారం భీమవరంలోని జెసి క్యాంప్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ అధికారి,సబ్ రిజిస్ట్రార్లతో మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ కమిటీ సమావేశం జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సేవలను గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న ప్రభుత్వం భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లను సైతం ఇక్కడే నుంచే చెయ్యాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం జిల్లాలో మొదటి విడతలో సబ్ రిజిస్ట్రార్ అధ్వర్యంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉండి మండలం పెద్దపుల్లేరు గ్రామ సచివాలయంలో విజయవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించుకున్నామని ఆయన తెలిపారు.

 ప్రస్తుతం రెండో విడతగా మరో 15 సచివాలయాలు ఎంపిక చేయడం జరిగిందని ఆయన అన్నారు. అత్తిలి, భీమవరం, కాళ్ళ, పెంటపాడు, వీరవాసరం, ఆచంట, ఇరగవరం, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, తణుకు, యలమంచిలి మండలాల్లో 15 సచివాలయాలను ఎంపిక చేసినట్లు జాయింట్ కలెక్టరు వివరించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అయన చెప్పారు.సచివాయాలు ద్వారా ప్రజలకు  భూముల క్రయ,విక్రయాలు  రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అయ్యి  ప్రయాణ భారంతో పాటు ఖర్చులు కూడా తగ్గతాయని జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రిజిస్ట్రారు  అధికారి ఆర్.సత్యనారాయణ, వివిధ సబ్ రిజిస్ట్రారులు , తది తరులు పాల్గొన్నారు.
సిఫార్సు