పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరగాలి


Ens Balu
11
2022-10-11 15:17:58

పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో పారదర్శకతతో నూతన విధానంలో నూటికి నూరుశాతం ధాన్యం కొనుగోలు చేసి మన జిల్లాను మొదటి స్థానంలో ఉండేలా సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని  జెసి జె.వి.మురళి అన్నారు. మంగళవారం స్వర్ణాంధ్ర ఇంజనీరింగు కళాశాల సమావేశ మందిరంలో నూతన విధానంలో ధాన్యం కొనుగోలుపై కస్టోడియన్ అధికారులు, వాలంటీర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, తది తరులుతో   నియోజక వర్గం ఒక్క రోజు శిక్షణ తరగతుల కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ధాన్యా గారంగా పేరున్న మన పశ్చిమగోదావరి జిల్లాలో పారదర్శకంగా నూతన విధానంలో ఖరీఫ్ 2022-23 ధాన్యం కొనుగోలు చేయాలని  అందుకు అనుగుణంగా అధికారులు సిబ్బంది పూర్తి అవగాహన కలగాలని అయన అన్నారు.

 రైతులకు తప్పనిసరిగా కనీస మద్దతు ధర అందే విధముగా పనిచేయాలని, గన్నీస్ , లేబరు , ట్రాన్స్ పోర్టు తది తర అంశాలు పై జిల్లా జాయింటు కలెక్టరు క్షుణ్ణంగా వివరించారు. ధాన్యం కొనుగోలులో  ఎలాంటి లోపాలు లేకుండా రైతులకు మంచి సేవలు అందించాలన్నారు. రైతులకు షెడ్యూల్, కూపన్ జనరేషన్  గ్రామ వ్యవసాయ సహాయకులు రైతు భరోసా కేంద్రములో  చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.  టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్లు ,కస్టోడియన్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులకు మొబైల్ ఆప్ (MOBILE APP) లో ప్రతి ఒక్కరూ నమోదు చేసు కోవాలని, ఇంకా చేసుకోవలసిన వారు ఉంటే శిక్షణ పూర్తి అయ్యేలోపు చేసి చూపాలన్నారు.

 ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతులు ఎందుకు ధాన్యం  అమ్మాలి ,కలిగే లాభాలు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ-కేవైసి, ఈ-క్రాప్ బుకింగ్ చేసిన రైతుల నుండి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని,ఇంకా చేసుకోవలసిన రైతులను గుర్తించి వారితో చేయించాలని అయన అన్నారు. ఎంతో కష్టపడి ఆరుగాలం శ్రమించి మనందరికీ అన్నం పెడుతున్న రైతన్నకు పండిన పంటకు గిట్టుబాటు ధర అందించి, సకాలంలో అమ్మినధాన్యానికి సొమ్ములు జమ చేయటమే మన ప్రథమ కర్తవ్యం అన్నారు. ధాన్యం కొనుగోలు విధులలో ఎవరైనా నిర్లక్ష్యం అలసత్వం వహించినట్లయితే అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని,బాగా పనిచేసిన వారిని గుర్తించి అభినందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి అన్నారు.

ఈ-కేవైసి నమోదుచేసిన జెసి..

ఈ-కేవైసి, ఈ-క్రాప్ బుకింగ్ ప్రతి రైతు విధిగా చేయించుకోవాలని దీని వలన ప్రతి రైతు ప్రయోజనాలు పొందుతారని ఆయన అన్నారు. సీతారామపురం శ్రీ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద  రైతుకు స్వయంగా ఈ-కేవైసి, ఈ-క్రాప్ బుకింగ్ ను జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి నమోదు చేశారు. ఈ శిక్షణ తరగతులలో జిల్లా సివిల్ సప్లై అధికారి యన్.సరోజ , సివిల్ సప్లై డి యం టి. శివ రామ ప్రసాదు, ఏ యస్ వో లు యం.రవి శంకర్, వై. ప్రతాప్ రెడ్డి, తహశీల్దారు యస్ యం ఫాజిల్ ,కస్టోడియన్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్లు , తది తరులు పాల్గొన్నారు.

సిఫార్సు