ప్రాథమిక హక్కుగా సమాచార హక్కు చట్టం


Ens Balu
9
2022-10-12 09:04:03

ప్రభుత్వం పరిపాలనలో భాగంగా ఏమేం చేస్తుందో తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్ట ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించిన  భావ ప్రకటన   స్వేచ్ఛలో సమాచార హక్కు చట్టం అంతర్భాగమని అన్నారు. ప్రజలు ఏదేని ఒక  అంశంపై సమాచారాన్ని కోరినప్పుడు నిర్ణీత సమయంలో దానిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు. దరఖాస్తుదారునికి 30 రోజుల లోపు సమాచారాన్ని ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ చట్ట ప్రకారం సమాచారం అడిగితే ఇవ్వడానికి కుదరదని, అందుబాటులో లేదని చెప్పడానికి అధికారులకు అవకాశం లేదన్నారు. 2005 అక్టోబర్ 12న కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకువచ్చిందని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,స్థానికులు పాల్గొన్నారు.
సిఫార్సు