అభివృద్ధి , సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాల కు అతీతంగా పరిపాలన అందించడమే సీఎం జగన్ ఆశయమని మంత్రి బుడి ముత్యాలనాయుడు అన్నారు. బుధవారం దేవరాపల్లి మండలం రైవాడ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిడ్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు పాల్గొని ప్రజలకు అందుతున్న పధకాలను . గ్రామా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా.. మొదటి దశలో భాగంగా బేతపూడిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి 48 23 లక్షల రూపాయలు నిధులతో అదనపు తరగతి గదుల భవనానికి భూమిపూజ చేసారు. పనుల విషయం లో ఎటువంటి రాజీ పడకూడదని , సీఎం జగన్ మార్క్ కనిపించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో 23. 50 లక్షల రూపాయలతో నిర్మించిన మండలపరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో మంత్రి సరదాగా గడిపి , విద్యార్థినులు జగన్ పై పడిన పాటను ఆస్వాదించారు .ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ కర్రి సత్యం మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు ఉర్రోకుల గంగా భవాని అప్పారావు, చింతల బుల్లి లక్ష్మి వెంకట రమణ మండల పరిషత్ మాజీ అధ్యక్షులు కిలపర్తి భాస్కరరావు , పార్టీ అధ్యక్షులు బూరె బాబు రావు, ఎమ్మార్వో, ఎంపిడిఓ, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.