ఖాళీ స్థలాలపై సిబ్బంది దృష్టిసారించాలి..


Ens Balu
7
2022-10-12 13:28:28

కాకినాడ నగరంలోని ఖాళీ స్థలాల్లో చెత్తను వేయడం వల్ల  అపరిశుభ్ర వాతావరణం నెలకొం టోందని ఏ డి సి సిహెచ్ నరసింహారావు చెప్పారు. ఈ విషయమై ఖాళీ స్థలాల యజమాను లకు సూచనలు ఇవ్వడంతో 30% మంది తమ స్థలాలను పరిరక్షించుకుని కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారన్నారు. బుధవారం నగరంలోని 24, 25 డివిజన్ లో పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీసీ మాట్లాడుతూ, కొంత మంది మాత్రమే స్థలాలకు కాంపౌండ వాల్ నిర్మించుకున్నారని  మిగిలిన 70 శాతం మంది  స్థానికంగా లేకపోవడం, ఇతర కారణాల వల్ల స్థలాలను పట్టించుకోవడం లేదన్నారు. దీనివల్ల  స్థానికులు చెత్తను తీసుకువచ్చి ఖాళీ స్థలాల్లో వేస్తున్నారని అసహం వ్యక్తం చేశారు. అక్కడ పందులు, కుక్కలు,పాములు చేరి ప్రజారోగ్యానికి భంగకరంగా మారుతున్నాయన్నారు. 

దోమల కూడా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏడిసి చెప్పారు. ఆయా స్థల యజమాలను గుర్తించి నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత డెంగీ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనికోరారు. ఫ్రైడే - ఫ్రైడే గా పాటించి ఎప్పటికప్పుడు నిలవనీటిని తొలగించుకోవాలని కోరారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వేయకుండా నగరపాలక సంస్థ సమకూర్చిన  డస్ట్ బిన్ లలో మాత్రమే ఉంచి పారిశుద్ధ్య  సిబ్బందికి అందజేయాలని ఆయన కోరారు. పారిశుధ్య నిర్వహణలో ఏమైనా లోపాలు ఉంటే  సంబంధిత సచివాలయానికి ఫిర్యాదు చేయవచ్చని ఏ డి సి సూచించారు. ఆయన వెంట సానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు