ఆహార సరఫరాలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఆంధ్ర ప్రదేశ్ ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. గురువారం అరకువేలి మండలం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, బాలికల ఆశ్రమ పాఠశాల, స్థానిక ఏరియా ఆస్పత్రిని , ఎండపల్లి వలస, పద్మాపురం అంగన్ వాడి కేంద్రాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత్తర గూడ గ్రామంలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం పంపిణీని పరిశీలించారు. నిత్యావసర సరుకులు సక్రమంగా సరఫరా చేయాలని ఆదేశించారు.పేద బడుగు వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరకుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏరియా ఆసుపత్రిలో రోగులకు సరఫరా చేస్తున్న ఆహార పదార్ధాలు పరిశీలించారు.జి.సి.సి. గొడౌన్లో కాలం చెల్లిన 180 బస్తాల కంది పప్పు ను సీజ్ చేసారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ కమీషన్ లక్ష్యాలు, సేవలుపై అవగాహన కల్పించారు. విద్యార్ధులకు ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 26జిల్లాలో పర్యటించి 339కేంద్రాలు తనిఖీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పౌసరఫరాలశాఖ అధికారులు శివ ప్రసాద్,వేణుగోపాల్, శ్రీహరి, జీసీసి డి.ఎం.లు పార్వతమ్మ, సింహాచలం, తహశీల్దార్ వేణుగోపాల్ తదతరులు పాల్గొన్నారు.