1877 అక్టోబర్ 13న గుజరాత్ రాష్ట్ర సూరత్ లో జన్మించిన భూలాభాయ్ దేశాయ్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అని పలుసార్లు జైలు శిక్ష అనుభవించిన నేత అని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ శ్రీరామ నామ క్షేత్ర ఆంధ్ర భద్రాద్రి ఆధ్వర్యంలో భూలాభాయ్ దేశాయ్ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో సైమన్ కమిషన్ ను వ్యతిరేకించడమే గాక విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి ఉద్యమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారని అన్నారు. ఆయన ప్రముఖ న్యాయవాది కావడంతో బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి రైతుల నుండి భూ ఆదాయాన్ని సవరించడం, జప్తు చేసిన భూములను తిరిగి రైతులకు ఇప్పించడం, ఉద్యమ ఖైదీలను విడుదల చేయించారని పట్నాయక్ తెలిపారు. క్షేత్ర అధ్యక్షులైన రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కుమార్ యాదవ్, అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.