వినియోగదారునికి ఉన్న హక్కులను నిర్ధారించి వారికి రక్షణ కల్పించేందుకు చట్టం రూపొందించబడిందని న్యాయవాది యనమల రామం పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్న వస్తువు లేదా ఒప్పందం ప్రకారం అసంపూర్తి సేవ చేసినా వినియోగదారుల క్రింద భావించి నష్టపరహారాన్ని పొందవచ్చు అన్నారు. 1986లో రూపొందిన వినియోగదారుల చట్టానికి 2019లో కొన్ని సవరణలు చేసి 2020 జూలై నుండి నూతన చట్టం అమలులోకి వచ్చిందన్నారు. నూతన చట్టం ప్రకారం దేశంలో వస్తువులను ఎక్కడ కొనుగోలు చేసి నా వినియోగదారుడు నివసించే ప్రాంతం నుండి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఉత్పత్తిలో లోపం ఉంటే ఉత్పత్తిదారులతో పాటు విక్రయించిన వారు, ప్రచారం నిర్వహించేవారు కూడా బాధ్యులేనని అన్నారు. వస్తువుల నాణ్యతలో లోపం ఉంటే కొనుగోలు చేసిన 21 రోజుల్లోపు ఫిర్యాదు చేయాలని అన్నారు. సంబంధిత బిల్లులతో పాటు అపిడవిట్ దాఖలు చేయాలని రామo తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.