గర్భిణీ, శిశువుల నమోదు పక్కగా జరగాలి


Ens Balu
8
2022-10-14 09:57:29

పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణీ, శిశువుల వైద్య పరీక్షలు, వివరాల నమోదు పూర్తి స్థాయిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్య అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో   ఏరియా ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, అధికారులతో వైద్య సేవలపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా, శిశు నమోదు పక్కగా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు సులభతరం అవుతుందన్నారు. ఎనీమియా ముక్తభారత్ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత గా తీసుకొని గర్భిణీలకు  హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు నిర్వహించి ఫలితాలను అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక యాప్ లో నమోదు చేయాలని సూచించారు.

 ఎన్ సి డి, సి డి సర్వేలో భాగంగా బి.పి, సుగర్ తోపాటు దీర్ఘ కాలిక రోగాలు, జ్వరాలు, మలేరియా వ్యాధుల వివరాల సర్వే పూర్తి కావాలన్నారు. శిశువులకు, చంటి పిల్లలకు సంబంధించి టీకా నిర్వహణ వివరాలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం క్రింద ప్రసవం అనంతరం అందిస్తున్న మొత్తాన్ని సకాలంలో చెల్లించాలని చెప్పారు. నాడు - నేడు కార్యక్రమం క్రింద నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులు త్వరితగతిన జరగాలని ఏపిఎమ్ఎస్ ఐడిసి ఇంజనీరింగ్ అధికారి ప్రసన్న కుమార్ ను ఆదేశించారు. శత శాతం బయోమెట్రిక్ హాజరు నమోదు అయ్యేవిధంగా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. బగాదిజగన్నాథ రావును ఆదేశించారు. 

అనంతరం అయుష్మాన్ ఉత్కృష్ట పురస్కారం జాతీయ అవార్డు జిల్లాకు రావటం పట్ల వైద్య, ఆరోగ్య అధికారులు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను దుస్సాలువాతో  ఘనంగా సత్కరించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి మరియు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి. వాగ్దేవి, రాష్ట్రీయ బాల స్వస్త్యా కార్యక్రమం సమన్వయ అధికారి డా. ధవళ భాస్కర రావు, జిల్లా మలేరియా అధికారి కె.పైడి రాజు, జిల్లా టి.బి. నియంత్రణ అధికారి సిహెచ్.విజయ్ కుమార్, జిల్లా రోడ్లు, భవలనాల శాఖ ఈ ఈ ఎమ్.జేమ్స్,  పార్వతీపురం, సీతంపేట డిప్యూటీ డిఎంహెచ్ ఓ లు పి.అనిల్, లక్ష్మీ పార్వతీ,  ప్రోగ్రామ్ అధికారులు, వైద్యులు, తదితరులు, పాల్గొన్నారు.
సిఫార్సు