ఈ క్రాప్ నమోదును తనిఖీ చేసిన కలెక్టర్


Ens Balu
19
2022-10-14 12:11:21

విజయనగరం జిల్లాలో  ఈ క్రాప్ నమోదును జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పరిశీలించారు. జామి మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ఈ క్రాప్ నమోదు వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడారు. వారి పంట వివరాలను, నీటి వనరులను, భూమి విస్తీర్ణాన్ని తెలుసుకొని, వాటిని నమోదు చేసిన రికార్డులను తనిఖీ చేశారు. అన్నీ వివరాలు సరిపోవడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులను ఆరా తీశారు. ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో జామి తహసీల్దార్ జె.హేమంత్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సునీత, ఆర్ఐ ఉషారాణి, ఏవో కిరణ్ కుమార్ ఉన్నారు.
సిఫార్సు