విజయనగరం జిల్లా జామి మండలంలో ఈ క్రాప్ నమోదును జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి శనివారం తనిఖీ చేశారు. ప్రతీ రైతు వివరాలను వ్యక్తిగతంగా పరిశీలించారు. జామి తాశీల్దార్ కార్యాలయంలో, ఆ గ్రామానికి చెందిన రైతులతో మాట్లాడి, రికార్డుల్లో నమోదు చేసిన వివరాలను తనిఖీ చేశారు. భూముల సర్వే నంబర్లు, పొలాల విస్తీర్ణం, రైతులు ఏ రకం పంటను ఎంత విస్తీర్ణంలో వేశారో, విత్తనాలు ఎక్కడ తీసుకున్నారో తదితర వివరాలు తెలుసుకున్నారు. ఆయా భూములకు నీటి సదుపాయంపైనా ఆరా తీశారు. ఈ వివరాలను రికార్డుల్లో తనిఖీ చేసి, సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. తమ పంటను రైతులు ఎక్కడైనా విక్రయించే స్వేచ్చ ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. తనిఖీల్లో తాశీల్దార్ జె.హేమంత్‌కుమార్, డిప్యుటీ తాశీల్దార్ సునీత, ఏఓ కిరణ్‌కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.