రైతులు ఈ- క్రాప్ లో నమోదుకావాలి


Ens Balu
10
2022-10-15 11:13:29

రైతులు ఇ క్రాప్ లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. వీరఘట్టం మండలం వండవ గ్రామంలో ఇ క్రాప్ నమోదును శని వారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇ క్రాప్ నమోదు వలన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అందే వివిధ రైతు పథకాలు, విపత్తులలో కలిగే నష్టాలకు పరిహారం చెల్లింపు వంటి అంశాలు ఇ క్రాప్ నమోదు కావడం వలన మాత్రమే లభిస్తుందని వివరించారు. ఏ పంటను ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారో ఇందులో తెలుస్తుందని తద్వారా ప్రయోజనాలు అందుతాయని చెప్పారు. ఇ క్రాప్ నమోదులో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

 సాంకేతిక సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. వెబ్ లాండ్ లో సవరణలు చేసే అవకాశం లేనందున కొన్నిసార్లు ఇబ్బందులు వస్తున్నాయని సచివాలయం సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, తహశీల్డార్ జె.మాధవిలత, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కే. మన్మథ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు