శంఖవరంలో 15 అడుగుల కొండచిలువ వీడియో వైరల్
Ens Balu
9
Sankhavaram
2022-10-18 01:55:00
శంఖవరం మండలకేంద్రంలోని గ్రామ శివారులో రోడ్డుపై తెల్లవారుజామున కనపడ్డ కొండచిలువ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. శంఖవరం పీహెచ్సీవద్ద మంగళవారం సుమారు 15అడుగుల కొండచిలువ రోడ్డుదాటుతుండగా రౌతుల పూడివైపు వెళ్లే వాహన చోదకులు వీడియోలు తీశారు. ఆసుపత్రి పక్కనే జిల్లాపరిషత్ హైస్కూలు కూడా ఉండటంతో ఆ ప్రాంతం నుంచే కొండచిలువ రావడాన్ని చూసి అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటువైపుగా వెళ్లేవారికి జాగ్రత్తలు చెప్పారు.