తొర్రేడులో ఈ-క్రాప్ బుకింగ్ ద్రువీకరణ


Ens Balu
13
Torredu
2022-10-18 07:17:05

రైతులు సాగుచేసే పంటకు  ఈ- క్రాప్ బుకింగ్, ఈ కేవైసి ద్వారా భరోసా పొంద గలుగుతారని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆన్నారు. మంగళవారం ఉదయం  రాజమండ్రి రూరల్ తోర్రేడు గ్రామంలో ఈ క్రాప్ నమోదు చేసుకున్న పలువురు రైతుల రికార్డ్స్ లను పరిశీలిచి, సదరు రైతులను తనిఖీ నిర్ధారణ రశీదు ను కలెక్టర్ తీసుకున్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ,  ప్రతి ఒక్క సాగు భూమి ఈకేవైసీ చేసే సమయంలో భూ యజమానులు, రైతులు వారి సెల్ ఫోన్లు కి వొచ్చే  ఓ టి పి వివరాలు వ్యవసాయ సిబ్బందికి తెలియ చేసి సహకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి లో రైతులు సాగుచేసే పంటలకు చెందిన సాగు చేసే పంట, విస్తీర్ణం వంటి రికార్డులను ధృవీకరణ చేసేందుకు తనిఖీ చేసినట్టు చెప్పారు.

 ఆ దిశలో తోర్రెడు గ్రామంలో ఏడు సర్వే నంబర్ల వ్యవసాయ భూమిలో సాగు విస్తీర్ణం కలిగిన నలుగురు భూ యజమానులు, ఇద్దరు కౌలు రైతులు సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం, తదితర వివరాలను నిర్ధారణ చేసి, సక్రమంగా ఉన్నట్లు ధృవీకరించటం జరిగిందనీ కలెక్టర్ పేర్కొన్నారు.  రైతులకు విత్తు నుంచి పంట కొనుగోలు చేసే వరకు ప్రతి ఒక్క స్థాయి లోనూ వారికి భరోసా కల్పిస్తూ అండగా నిలవడం జరుగుతోందని కలెక్టర్ కె. మాధవీలత అన్నారు. ఈ క్రాప్ యొక్క ప్రయోజనాలు రైతులకు వివరించి, ప్రతి ఒక్క రైతు వారు సాగు చేసే పంట యొక్క వివరాలు ఈ క్రాప్ నమోదు తో పాటు ఈ కేవైసి తప్పనిసరి చెయ్యడం లో క్షేత్ర స్థాయి సిబ్బందికి సహకరించాలన్నారు.   క్షేత్ర స్థాయి లో జరుగుతున్న ఈ క్రాప్ నమోదు ను ఆయా క్షేత్ర స్థాయి లో తనిఖీ  కలెక్టర్ స్థాయి రెండు రోజుల క్రితం పిడింగొయ్య లో పర్యటించినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఇతర అధికారులు, రైతులు ఉన్నారు.
సిఫార్సు