తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలి


Ens Balu
15
Gopavaram
2022-10-18 14:15:35

రైతులు సాగుచేసే పంటకు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు జరగాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆన్నారు. మంగళవారం నిడదవోలు మండలం లోని పురుషోత్త పల్లి, గోపవరం, పెండ్యాల గ్రామాల్లో  ఈ క్రాప్ నమోదు చేసుకున్న పలువురు రైతుల రికార్డ్స్ లను పరిశీలిచి, సదరు రైతుల నుంచి తనిఖీ నిర్ధారణ రశీదు ను కలెక్టర్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ,  సాగు చేసే  భూమిని ఖచ్చితంగా  ఈకేవైసీ లో నమోదు అయ్యేలా చూడాలని, అభిమానులు ఇందుకోసం ఆర్ బి కే , సచివాలయ వ్యవస్థ లో పని చేసే వ్యవసాయ అనుబంధ రంగంలోని సిబ్బందికి తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. భూ యజమానులు, రైతులు వారి సెల్ ఫోన్లు కి వొచ్చే  ఓ టి పి వివరాలు వ్యవసాయ సిబ్బందికి తెలియ చేసి వారి పంట ఈ క్రాప్, ఈ కేవైసి  అయ్యేలా సహకరించాలన్నారు. 

రావిమెట్ల గ్రామానికి చెందిన గ్రామ హార్టికల్చర్ సహాయకుడు టి. సూర్య ప్రకాష్ వంద శాతం ఈ క్రాప్ నమోదు చేసిన సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత  సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రకాష్ తన పనితీరులో చూపిన విధంగా ప్రతి ఒక్కరూ వారి పరిధిలో నూరు శాతం లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి లో రైతులు సాగుచేసే పంటలకు చెందిన సాగు చేసే పంట, విస్తీర్ణం వంటి రికార్డులను, జారీ చేసిన ధృవ పత్రాలను నిర్ధారణ చేసినట్లు పేర్కొన్నారు. ఎనిమిది  సర్వే నంబర్ల లోని వ్యవసాయ భూమిలో గుర్రం సీతారత్నం (పురుషోత్తపల్లి) మూడు సర్వే నంబర్ల లో,  జీ. రాజా రావు రెండు సర్వే నంబర్ల లో, గోపవరం కి చెందిన ఏం. రంగారావు, పెండ్యాల కి చెందిన జీ. గంగరాజు, ఎన్ వి ఎస్ సత్యనారాయణ ఒక్కో సర్వే నంబర్ లలో ఆయా  రైతులు సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం, తదితర వివరాలను నిర్ధారణ చేశామన్నారు. 

ఈ క్రాప్ యొక్క ప్రయోజనాలు  క్షేత్ర స్థాయి లో జరుగుతున్న ఈ క్రాప్ నమోదు ను పరిశీలన కోసం క్షేత్ర స్థాయి  పర్యటించినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. కలెక్టర్ వెంట  వ్యవసాయ అధికారి జి.సత్యనాయణ, హార్టికల్చర్ అధికారి గంజి రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది రైతులు ఉన్నారు.
సిఫార్సు