కాకినాడ 25వ డివిజన్‌లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. కొవ్వూరు రోడ్డు ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి మూడేళ్ల ప్రభుత్వ పాలనలో నవరత్న పథకాల ద్వారా ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ... సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. కౌడా చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తికుమార్, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్, నగరపాలక సంస్థ కమిషనర్ కే.రమేష్, మాజీ కార్పొరేటర్లు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రతి కష్టానికి ఒక్కొక్క పథకం అమలులో ఉందన్నారు.
నవరత్న పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 94 శాతానికి పైగా అమలు చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి వద్ద పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్టాలు,సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని అందువల్లే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్‌కుమార్, మాజీ కార్పొరేటర్లు జగన్నాథన్ విజయ్ కుమార్, కామాడి సీత, నల్లబెల్లి సుజాత, సంగాని నందం, వాసిరెడ్డి రాంబాబు, కర్రీ శైలజ,తదితరులు పాల్గొన్నారు.