24న సింహగిరిపై దీపావళి పండుగ..గంట్ల


Ens Balu
33
Simhachalam
2022-10-19 07:51:01

దక్షిణ భారతదేశంలో అత్యంత పేరు గాంచిన సింహాచలం శ్రీ శ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి (సింహాద్రి అప్పన్న)ఆలయంలో ఈ నెల 24న దీపావళి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతియేటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఉత్సవాలను ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. ఈనె25 న సూర్యగ్రహణం రావడంతో దీపావళి పర్వదినం రోజే నరకచతుర్దశి వేడుకను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు ఉత్సవాలను ఘనంగా జరపడంతో పాటు అమావాస్య సందర్భంగాఅదే రోజు రాత్రికి తిరువీధి మహోత్సవాన్ని మాడవీధుల్లో వైభవంగా జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సింహద్రినాధుడు ను దర్శించుకున్న అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు  దీపావళికి సంబంధించి ఆలయ వర్గాలు చేస్తున్న ఏర్పాట్లు, పండగలు నిర్వహణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సూర్య గ్రహణం సందర్భముగా 25 న తిరుమంజనం, మహోసంప్రోక్షణ తడతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తమకు తెలిపారని శ్రీను బాబు చెప్పారు.

సిఫార్సు