మనం తీసుకునే ఆహార పదార్థాలు వాటి నుంచి ఎన్ని క్యాలరీలు అందుతున్నాయన్న వాటిపై అవగాహన పెంచుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని పోషకాహార నిపుణులు పి. పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోటు క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అనారోగ్యానికి గురి చేసే కొవ్వు పదార్థాలు తినరాదన్నారు. ప్రాసెస్ చేసినవి, బయట దొరికే జంక్ ఫుడ్స్, సాచ్యులేటెడ్ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడాన్ని పరిమితం చేయాలన్నారు. వేపుళ్ళు, గ్రేవీలు తినరాదన్నారు. తృణధాన్యాలు, గింజలు, పొట్టు ధాన్యాలు, ఓట్స్ లాంటి మేలు చేసే సంక్లిష్ట పిండి పదార్థాలను ఎంచుకోవాలని పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు.