సచివాలయ నిర్మాణాలు సత్వరం పూర్తికావాలి..


Ens Balu
2
Hukumpeta
2020-09-22 19:03:50

ఏజెన్సీలోని గ్రామసచివాలయ భవన నిర్మాణాలు సత్వరం పూర్తిచేయాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల అధికారులను ఆదేశించారు. హుకుం పేటలో పీఓ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా బాకూరు గ్రామంలో జరుగుతున్న భూ సర్వే,పనులు పరిశీలించారు. సర్వే వేగంగాపూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ బాలురు, బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులు తనిఖీ చేశారు. రూ.18 లక్షలతో ఎం పిపి పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పనులు తనిఖీ చేశారు. పటిష్టమైన నాణ్యతలు పాటించాలన్నారు. 82 కుటుంబాలను సర్వే చేశామని రెవిన్యూ  అధికారులు వివరించారు. గ్రామసభ తీర్మాణాలపై ఆరాతీశారు.సుండ్రుపుట్టు గ్రామం రైతు డూరు ఈశ్వరరావు పొలంలో ఐటీడీఏ సహాయంతో వేసిన జామ తోట,మొదమాంబ స్వయం సహాయక సంఘానికి ఇచ్చిన  సోలార్ పంపుసెట్ ను పరిశీలించారు. పంపుసెట్ పనితీరు గురించి, సరఫరా చేస్తున్న నీటి సామర్ధ్యం పై ఆడిగితెలుసుకున్నారు. దిగుడుపుట్టు గ్రామంలో పౌల్ట్రీ ని  రూ.2.80లక్షల వ్యయం తో నిర్మిస్తున్న సోలార్ తాగునీటి పధకం పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేసి వినియోగం లోకి తీసుకురావాలని వెలుగు అధికారులను ఆదేశించారు.  గెడ్డంగి నారాయనమ్మ నాటు కోళ్ల పెంపకాన్ని పరిశీలించారు. ప్రతి గ్రామంలో 5గురికి కోళ్లు  పంపిణీ చేయాలని వెలుగు అధికారులను ఆదేశించారు. పౌల్ట్రీ పై  వస్తున్న ఆదాయ వ్యయాలను అడిగి తెలుసుకున్నారు. రూ.42 లక్షలతో నిర్మిస్తున్న  సూకూరు  గ్రామ సచివాలయం నిర్మాణపు పనులు, గిరిజన సంక్షేమ బాలుర  ఆశ్రమ పాఠశాలలో రూ.42.69లక్షలతో చేపట్టిన మనబడి నాడు పనులు తనిఖీ చేశారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  భీమవరం గ్రామంలో  గ్రామ సచివాలయం,రైతు భోరోసా కేంద్రం పనులు తనిఖీ చేశారు.గ్రామంలో తాగునీటి సదుపాయాలు, మొబైల్ టవర్ నిర్మించాలని గ్రామస్థులు కోరగా పి ఓ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈ ఈ జి.మురళి, వెలుగు ఎపిడి ఎం.నాగేశ్వరరావు, తహసీల్దార్ వై.వి కోటేశ్వరరావు, ఎంపిడివో ఇమ్మనియేలు, ఏ ఈ దేముళ్లు, డిపి ఎం సత్యం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.