కాకినాడ జిల్లాకలెక్టర్‌ డా. కృతికాశుక్లా ఔదార్యం


Ens Balu
25
Yeleswaram
2022-10-19 14:13:19

కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తన ఔదార్యన్ని మరోసారి చాటుకున్నారు. బుధవారం ఏలేశ్వరం పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్నిపరిశీలించారు. జనరల్ వార్డులో టైఫాయిడ్ నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏలేశ్వరానికి చెందిన ఎం. లలితను(16) జిల్లా కలెక్టరు కృతికా శుక్లా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పుట్టుక‌తో మానసిక విభిన్న ప్రతిభావంతురాలు అయిన తన కుమార్తె లలితకు వీల్‌ఛైర్ మంజూరుచేయాల్సిందిగా తల్లి సింహాచలం కలెక్టరును అభ్యర్థించగా జిల్లా కలెక్టరు కృతికా శుక్లా వెంటనే స్పందించి లలితకు అవసరమైన వీల్‌ఛైర్ అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తమకు ఆసరాగా నిలిచిన కలెక్టర‌మ్మకు ల‌లిత, ఆమె తల్లి సింహాచలం జిల్లా కలెక్టరుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
సిఫార్సు