రైతులు సాగుచేసే పంటకు భరోసా ఇచ్చే దిశలో ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించుకునే లా శ్రమించాలని తూ.గో.జి. జెసి సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు మండలం లోని మద్దూరు, మద్దురులంక గ్రామాల్లో ఈ క్రాప్ నమోదు చేసుకున్న పలువురు రైతుల రికార్డ్స్ లను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, సాగు చేసే ప్రతి రైతు తాను సాగు చేసే భూమిని ఖచ్చితంగా ఈకేవైసీ లో నమోదు అయ్యేలా చూసుకోవాలన్నారు. ఇందుకోసం ఆర్ బి కే , సచివాలయ వ్యవస్థ లో పని చేసే వ్యవసాయ అనుబంధ రంగంలోని సిబ్బందికి క్షేత్ర స్థాయి లో తగు సమాచారం సేకరించి వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చెస్తున్నట్టు పేర్కొన్నారు.
భూ యజమానులు, రైతులు వారి సెల్ ఫోన్లు కి వొచ్చే ఓ టి పి వివరాలు వ్యవసాయ సిబ్బందికి తెలియ చేసి వారు సాగు చేసే పంట ఈ క్రాప్, ఈ కేవైసి అయ్యేలా సహకరించాలన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈ కేవైసి పూర్తి చేసిన వాటికి సంబందించిన రికార్డులను రాండమ్ గా పరిశీలించి, క్షేత్ర స్థాయి లో ధృవీకరణ చెయ్యడం జరుగుతోందన్నారు.
మద్దూరు లంక గ్రామంలో బొలిశెట్టి చిట్టి రామకృష్ణ , బొలిశెట్టి చిట్టినాగు, చిగురులంక గ్రామంలో బొలిశెట్టి భాగయ్య మద్దూరు గ్రామంలో అన్నంరెడ్డి సూర్యారావు అన్నంరెడ్డి యతేంద్ర కుమార్ లు సాగు విస్తీర్ణం ఈ క్రాప్, ఈకెవైసి నమోదు వివరాలు తనిఖీ చేసి, సక్రమంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ వెంట వ్యవసాయ అధికారి సహాయ సంచాలకులు చంద్రశేఖర్, తహశీల్దారు బి. నాగరాజు నాయక్ , జి.సత్యనాయణ, సచివాలయ, అర్భికే వ్యవసాయ, హార్టికల్చర్ సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది, రైతులు ఉన్నారు.