పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకోవాలి
Ens Balu
23
Annavaram
2022-10-26 06:48:07
పోలీసు అమరవీరుల సేవలను ప్రతి ఒక్క పౌరుడు గుర్తుంచుకోవాలని ఎస్ఐ శోభన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం అన్నవరం పోలీస్ స్టేషన్లో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, ఓపెన్ హౌస్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విధి నిర్వహణలో విరోచిత మరణం పొందిన పోలీసుల గుర్తుగా పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రక్షకబటులు ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తారు..అత్యవసర సమయంలో వారిని ఏ విధంగా కాపాడుతారు.. పోలీస్ సేవలను ప్రజలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి.. స్టేషన్ లో ఫిర్యాదులకు 100 ఏ ఏరకంగా ప్రజలకి ఉపయోగపడుతుంది.. ఏవిధం సద్వినియోగం చేసుకోవాలి.. తదితర అంశాలను కూడా ఎస్సై విద్యార్థినీ, విద్యార్థులకు విపులంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ మహిళా పోలీసులు జిఎన్ఎస్.శిరీష, పి.కళాంజలి, స్టేషన్ సిబ్బంది. విద్యార్ధులు పాల్గొన్నారు.