నిరుద్యోగులకు శరభన్నపాలెంలో మినీజాబ్ మేళా


Ens Balu
34
శరభన్నపాలెం
2022-10-30 14:34:45

కొయ్యూరు మండలం శరభన్న పాలెం లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 31వ తేదీ సోమవారం మినీ జాబ్ మేళా ఏర్పాటు చేసామని, ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు.  రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మినీ  జాబ్ మేళాలో  మోహన్ స్పింటేక్ష్, సెంట్రల్ ఫార్మసీ, మథర్ అండ్ ఫాథర్ హోమ్ నర్సింగ్ సర్వీసెస్ అనే మూడు సంస్థలు  పాల్గొంటాయని  వాటి  ద్వారా హెల్పర్స్, ఆపరేటర్స్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, ట్రైనీస్, డెలివరీ బాయ్స్, బేసిక్ కేర్ టేకర్స్, నర్సింగ్ స్టాప్ మొదలగు 125 ఖాళీలు భర్తీ చేయటం జరుగుతుందని వివరించారు. ఈ జాబ్ మేళాకు ఆసక్తి గల  5 నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, ఎ ఎన్ ఎమ్ , ఎం పి హెచ్ డబ్ల్యు, జి ఎన్ ఎమ్ , బి.ఎస్.సి నర్శింగ్ శిక్షణ పొందిన 18 నుండి 35  సంవత్సరాల వయసు గల యువతీ యువకులు www.apssdc.ఇన్ అనే వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, లేదా ఆ రోజు నేరుగా హాజరు కావచ్చని కలెక్టర్ సూచించారు.  ఎంపికైన అభ్యర్ధులు  విజయవాడ, విశాఖపట్నంలలో   పని చేయాల్సి ఉంటుందని, వారి అర్హతలు, ఎంపికైన సంస్థ ఆధారంగా రూ.7,500 నుండి రూ. 15,000ల వరకు జీతం లభిస్తుందని కలెక్టర్ వివరించారు. జాబ్ మేళాకు హాజరయ్యేవారు వారి దరఖాస్తు, విద్యార్హతల జిరాక్ష్ ప్రతులు, ఆధార్, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకుని రావాలని, ఇతర వివరాలకు 94917 86463, 63026 36174 నంబర్లలో సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. 
సిఫార్సు