వెంగలరాయసాగరం రిజర్వాయర్ లో చేప పిల్లలు విడుదల


Ens Balu
23
Salur
2022-11-05 16:08:18

ప్రభుత్వ సహకారంతో లైసెన్సుడు రిజర్వాయర్ లో విడుదల చేసిన చేప పిల్లలతో మత్స్యకారులు ఉపాది ఏర్పాటు చేసుకొని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి పేర్కొన్నారు. శనివారం మన్యం జిల్లా, సాలూరు మండలంలోని వెంగళరాయసాగరం లైసెన్సెడ్ రిజర్వాయర్ లో 4 లక్షల చేప పిల్లలను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఉపసంచాలకులు నిర్మల కుమారి మాట్లాడుతూ, విజయనగరం జిల్లా తాడిపూడి చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో అభివృద్ధి చేసిన  80-100 ఎంఎం సైజుగల మూడు రకాల చేపపిల్లలను ఈ రిజర్వాయర్ లో విడుదల చేశామని వివరిరంచారు. లబ్దిదారులగా వాటా 40శాతం ప్రస్తుతం ఫిష్ షీడ్ ఫార్ం ద్వారా విడుదల చేశామని, త్వరలోనే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మరో ఆరు లక్షలు చేప పిల్లలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న ఆమె వివరించారు. మత్స్యకారులు ఫిష్ కియోస్క్ లు, ఇన్సులేటెడ్ వెహికల్స్, మినీ ఫిష్ రిటైల్ యూనిట్లు ఏర్పాటు ద్వారా ప్రభుత్వ రాయితీలు పొందచ్చునన్నారు. 

మన్యం జిల్లా ఫిషరీష్ ఏడీ తిరుపతయ్య మాట్లాడుతూ, చేప పిల్లల విడుదలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  వీటి ద్వారా మత్స్యకారులకు వేట, ఉపాది దొరుకుతుందన్నారు. జలాశయంలోని మత్స్యసంపద ద్వారా మత్స్యకారులు ఉపాదిని మెరుగు పరుచుకోవాలని సూచించారు.  వైఎస్ ఎంపీపీ గుణవతి మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించిన ఈ చేప పిల్లల విడుదలను, తద్వారా వచ్చే మత్స్య సంపదను మత్స్యకారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీఓ  పార్వతి,  మాట్లాడుతూ, ఒకేసారి నాలుగు లక్షల చేప పిల్లలు విడుదల చేయడం ద్వారా అవి పెరిగి దశలవారీగా పెరిగి మత్స్యకారులకు ఉపాదికి మంచి మార్గం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జి.రాములమ్మ, ఎంపిటిసి ఎం.అనూష, , ఎఫ్డీఓలు నాగమణి, ప్రసాద్, సిహెచ్వీ ప్రసాద్, ఈఓపీఆర్డీ ప్రసాద్, గిరిజన మత్స్యకార సంఘం అధ్యక్షులు తిరపతి, పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు.

సిఫార్సు