నకిలీ లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


Ens Balu
25
Sankhavaram
2022-11-05 16:44:52

ప్రజలు నకిలీ లోన్ యాప్ లు, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామసచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష సూచించారు. శనివారం శంఖవరం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-1లో ఏర్పాటు చేసిన ఫేక్ లోన్ యాప్ అవగాహనా  కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తులు, నెంబర్లు ద్వారా వచ్చే కాలర్స్ తో మాట్లాడేటపుడు జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా ఓటీపీలు, ఆధార్, బ్యాంకు అకౌంట్ నెంబరు, ఏటీఎం నెంబరు చెప్పమని అడగినపుడు వెంటనే తిరస్కరించాలన్నారు.  ప్రభుత్వ రంగ బ్యాంకులు నుంచి ఎప్పుడు వినియోగదారులకు ఫోన్లు రావనే విషయాన్ని గుర్తించాలన్నారు. తెలిసిన వ్యక్తల మాదిరి ఎవరైనా నమ్మకంగా మాట్లాడినా.. అలాంటి వారిపట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఎవరైనా ఫోన్లు చేసి ఓటీపీలు, లోన్లు కోసం మాట్లాడినపుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల జిల్లా పోలీసుశాఖ విడుదల చేసిన బోర్డులలోని అంశాలను మహిళలకు వివరించారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా తక్షణమే సమాచారం  అందించాలన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలతో దిశయాప్ లను ఇనిస్టాల్ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామసచివాలయం-3 కార్యదర్శి శంకరాచార్యలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామంలోని మహిళలు పాల్గొన్నారు.
సిఫార్సు