సామాజిక న్యాయమే న్యాయస్థానాల లక్ష్యం
Ens Balu
16
Kakinada
2022-11-11 09:23:38
సమాజంలో నెలకొన్న సామాజిక అసమానతలను తొలగించడానికి న్యాయస్థానాలు కృషి చేస్తున్నాయని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చట్టం దృష్టిలో అందరూ సమానమైనని, ధనిక వర్గాలకు చుట్టం కాదన్నారు. అన్యాయానికి గురైన నిస్సహాయులకు చేయూతనివ్వడానికి ప్రతి కోర్టులోనూ న్యాయ సేవాధికార సంస్థలు ఏర్పడ్డాయని అన్నారు. వీటి ద్వారా కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందవచ్చు అని అన్నారు. సమాజంలో అసమానతలు తొలగించడమే న్యాయవ్యవస్థ ప్రాథమిక లక్ష్యం అని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.