కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూడం అని తన పాదయాత్రలో చెప్పిన విధంగా గ్రామాలలో పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా మధ్యవర్తిత్వం లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుని ఖాతాలోనే జమ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలం కట్యచార్యుల పేట సచివాలయం పరిధిలోని వెదుళ్ళ వలస గ్రామంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహించారు. సంక్షేమ పథకాలు వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యలు ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాల తరువాత ప్రతి గడపకు వెళ్లి అందించిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తున్నామంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై ఉన్న నమ్మకమని స్పీకర్ తమ్మినేని అన్నారు.
గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను బేరీజు వేయాలన్నారు. పనిచేసే ప్రభుత్వాo పది కాలాలపాటు నిలిచేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిలకలపల్లి సురేష్, జడ్పిటిసి బెండి గోవిందరావు, పిఎసిఎస్ అధ్యక్షులు గురుగుబిల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు మానుకొండ వెంకటరమణ, సోమరాజు జగన్నాథం, ఎన్ని చంద్రయ్య, సైలాడ దాసు నాయుడు, గురుగుబెల్లి నీలారావ్, టి రామారావు, పొన్నాడ రాము, గురుగుబిల్లి ప్రభాకర్ రావు, కూటుకుప్పల సన్యాసిరావు, మెట్ట ఆనందరావు, పొన్నాడ కృష్ణారావు, మెట్ట వసంత, గురుగుబిల్లి చలపతి, మామిడి డిల్లేశ్వరరావు, గురుగుబెల్లి చంద్రయ్య, తదితర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.