ఆర్బీకేలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జెసి..


Ens Balu
12
West Godavari
2022-11-16 13:02:32

పెంటపాడు మండలం ఆకుతీగల పాడు, దర్శిపర్రు, పెంటపాడు 1,2,3 ఆర్ బి కేలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా జాయింటు కలెక్టరు  జె వి మురళి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు,  రైతులు పేర్లు నమోదు, టోకెన్లు జారీలను పరిశీలించారు. ధాన్యంలో తేమ శాతం వ్యత్యాసం లేకుండా ఖచ్చితంగా నిర్ధారించాలన్నారు. రైతులకు నూతన ధాన్యం కొనుగోలు విధానంపై పూర్తి అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వమే రవాణాన్ని ఏర్పాటు చేసే విధానాన్ని,  రైతులే సొంతంగా హమాలీలను, రమాణా, గన్ని బ్యాగులు ఏర్పాటు చేసుకుంటే  చెల్లించే నగదు వివరాలను విపులంగా తెలియజేయలన్నారు.  రైతులకు ధాన్యం రవాణాలో వాలంటీర్లు సహాయంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రెవిన్యూశాఖల అధికారులు,  రైతు భరోసా కేంద్ర సిబ్బంది , రైతులు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు