అనకాపల్లి నూకాలమ్మతల్లికి కొణతాల ప్రత్యేక పూజలు..
Ens Balu
22
Anakapalle
2022-11-17 15:12:18
అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారికి జై అనకాపల్లి సేన అధ్యక్షులు కొణతాల సీతారాం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం తన అనుచరులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్థానికుడే నాయకుడు..నాయకుడే స్థానికుడు అనే నినాదంతో ప్రజలతోనే ఉంటున్నామని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని అన్నారు. అమ్మలగన్న అమ్మ నూకాలమ్మ దయతో ఈ ప్రాంతవాసులంతా శుభిక్షంగా ఉండాలని అమ్మను కోరినట్టు ఆయన తెలియజేశారు. తన జీవితం ఈ ప్రాంత ప్రజలకే అంకితం చేయాలనే నిర్ణంతో ప్రజానాయకుడిగా ముందుకి సాగుతున్నామని అన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రజాక్షేత్రంలో గెలిచిన వారంతా నియోజకవర్గాన్ని అభివృద్ధిచేయాలని కోరుకుంటున్నట్టు వివరించారు. ప్రజల మనిషిగా స్థానికుడిగా ఇక్కడే ఉంటూ అందిరకీ అందుబాటులో ఉంటున్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో జై అనకాపల్లి సేన బృందం సభ్యులు, కొణతాల అభిమానులు, కార్యకర్తలు పాల్గోన్నారు.