ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు వినియోగించుకోవాలి


Ens Balu
16
Elamanchili
2022-12-06 12:27:35

 ప్రభుత్వ వైద్య సేవలు ప్రజల ఇంటి వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ (డాక్టర్) సేవలను అందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పిలుపునిచ్చారు.  మంగళవారం ఆయన ఎలమంచిలి మండలంలో నాడు నేడు పనులను పరిశీలించారు.  ఎలమంచిలి సి.హెచ్.సి, రేగుపాలెం పి.హెచ్.సి., ఎలమంచిలి పట్టణంలోని కొత్తపేట పాఠశాలను పరిశీలించారు.  వచ్చిన రోగులతో ఆయన మాట్లాడుతూ వైద్య సేవలను గూర్చి ఆరా తీశారు. రేగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలను పరిశీలించారు. ప్రతి పిహెచ్ సి పరిధిలో ఒక డాక్టరు నియమిత కాలాలలో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్యం పరిశీలిస్తారని డిఎంహెచ్వో చెప్పు తెలియజేయగా అక్కడికి వచ్చిన మహిళలను ఈ విషయమై కలెక్టర్ అడిగారు.  మహిళలు తమ ఊరికి డాక్టర్ వస్తున్నారని చెప్పారు.

అదేవిధంగా ఆశా కార్యకర్తలను గూర్చి కూడా అడిగి తెలుసుకున్నారు.  నాడు నేడు పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ పర్యటనలో డిఎంహెచ్వో డాక్టర్ ఏ. హేమంత్, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇతర అధికారులు పాల్గొన్నారు.

సిఫార్సు